వచ్చే ఏడాది సమంతతో నా పెళ్లి: చైతు!

టాలీవుడ్ లో సెలబ్రిటీ కుటుంబానికి చెందిన అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ.. సమంత చెప్పడంతో
తన ప్రేమ వ్యవహారం పబ్లిక్ అయింది. అప్పటినుండి రోజుకో వార్త వస్తూనే ఉంది. సమంత ప్రేమించేది
చైతునే అని అందరికీ తెలిసిపోయింది. అయితే ఈ విషయంపై నాగచైతన్య మాత్రం ఇప్పటివరకు
స్పందించలేదు. ఇటీవల నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చైతుకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాం…
ఆ అమ్మాయి ఎవరో మీకు కూడా తెలుసు.. సమంతనే అంటూ ఓపెన్ గా చెప్పేశాడు. ఇప్పుడు
నాగచైతన్య కూడా ఈ విషయాన్ని రివీల్ చేశాడు. సెలబ్రిటీ బాడ్మింటన్ లీగ్ కు సంబంధించి
టాలీవుడ్ తండర్స్ టీంకు నాగచైతన్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ టీం
పరిచయ కార్యక్రమం నిన్న చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా నుండి ఎదురైన ప్రశ్నకు చైతు సమాధానం చెబుతూ.. వచ్చే ఏడాది సమంతతో తన వివాహం జరగబోతున్నట్లు చెప్పాడు.

CLICK HERE!! For the aha Latest Updates