పెళ్లి చేసుకున్న అవికా గోర్‌.. ఫొటో వైరల్‌

తెలుగులో చిన్నారి పెళ్లికూతురుగా పరిచయమైన అవికా గోర్ పెళ్లి చేసుకుందనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. టాలీవుడ్‌లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సినిమా చూపిస్తమామ, రాజుగారి గది-3 వంటి సినిమాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈమె ఉన్నట్టుండి ఎవరికీ తెలియకుండా ఆమె పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తెలిసింది. తోటి నటుడు ఆదిల్ ఖాన్‌ను ఒక చర్చిలో పెళ్లి చేసుకున్నట్లు ఈ ఫొటోల ద్వారా తెలుస్తోంది. అవికా, ఆదిల్ ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో చర్చిలో ఒకరి చేతులు మరొకరు పట్టుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరికీ ఇన్‌స్టాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కానీ ఆ తరువాతే అసలు విషయం తెలిసింది.

అవిక గోర్, ఆదిల్ ఖాన్ ఇద్దరూ కలిసి ‘కాదిల్’ పేరుతో ఒక సాంగ్ చేశారు. ఇది త్వరలో విడుదల కానుంది. ఈ పాట కోసమే వెడ్డింగ్ ఫోటోషూట్ జరిగినట్టు తెలుస్తోంది. ఇన్‌స్టాలో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలకు హార్ట్ ఎమోజీతో పాటు.. ట్యాగ్‌ చివర్లో హ్యాష్‌ట్యాగ్‌ కాదిల్ అని, త్వరలో రానుందని పేర్కోవడం విశేషం. ఇదంతా సాంగ్ ప్రమోషన్లో భాగంగా చేసిన పని అని ఫ్యాన్స్ తరువాత తెలుసుకున్నారు. ముందు ఆమె నిజంగానే పెళ్లి చేసుకుందని చాలామంది భావించి నెటిజన్లు పెళ్లి శుభాకాంక్షలు కూడా తెలిపారు. కానీ ఆ తరువాతే సాంగ్ ప్రమోషన్‌ కోసం ఇలా చేశారని అందరికీ తెలిసింది. తాను మిలింద్ చంద్వానీ అనే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు అవికా గత ఏడాది ప్రకటించింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కూడా చెప్పింది. మిలింద్ కలిసి దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో చాలాసార్లు షేర్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Avika Gor (@avikagor)

CLICK HERE!! For the aha Latest Updates