వెంకీ మాస్‌.. చైతు క్లాస్‌

మల్టీ స్టారర్ సినిమాల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్న స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడ ఒకరు. ఇప్పటికే మహేష్ బాబుతో కలిసి నటించిన ఆయన కొద్దిరోజుల క్రితమే వరుణ్ తేజ్ తో కలిసి F2 సినిమా మొదలుపెట్టారు. అంతేగాక త్వరలో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ఒక సినిమా చేయనున్నాడు.

బాబీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ‘వెంకీ మామ’ అనే టైటిల్ ను నిర్ణయించారట. ఈ సినిమాలో వెంకటేష్ పల్లెటూరికి చెందిన మాస్ క్యారెక్టర్ చేయనుండగా, నాగ చైతన్య సినీ కుర్రాడిలా క్లాస్ గా కనిపిస్తాడట. ఇందులో వెంకీకి జోడీగా హ్యూమా ఖురేషి, చైతూకి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నారు. బాబి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన బాబి ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.