వర్మ గొప్ప సింగరా..? లేక పవన్ కళ్యాణా..?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
ఇప్పుడు కూడా మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. రామ్ గోపాల్ వర్మ
ప్రస్తుతం వంగవీటి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ‘చంపరా’ అనే పాట
ఉంది. ఈ పాటను స్వయంగా వర్మ పాడారు. ఇది ఇలా ఉండగా నేను పాడిన పాట
ఎలా ఉంది? పవన్ కల్యాణ్ పాడిన దానికంటే నేను బాగా పాడానా..? అంటూ పవన్
కాకినాడ సభలో పాడిన పాటను షేర్ చేశారు. అంతేకాదు ఎవరి గొంతు బాగుందంటూ..
అందరి హీరోల ఫ్యాన్స్ ను అడుగుతున్నారు. దీంతో పవన్ తిక్కకు మించి వర్మకు
పైత్యం ఉందని కామెంట్స్ చేస్తున్నారు.