వర్మ మీద పి.హెచ్.డి!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తూ..
ఉంటారు. ఆయన తెరకెక్కించే చిత్రాలు, ఎన్నుకునే కథలు రెగ్యులర్ సినిమాలకు విభిన్నంగా
ఉంటాయి. ఎక్కువగా జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు చేయడం వర్మ ప్రత్యేకత. ఎవరికి
అర్ధం కానీ ఈ దర్శకుడిపై ఓ విధ్యార్థి ఏకంగా పి.హెచ్.డి చేయడానికి సిద్ధమయిపోయాడు. ఈ
విషయాన్ని వర్మ తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. నేను పి.హెచ్.డిలో ఓ సబ్జెక్ట్..? నా
కూతురేమో నన్ను జూ లో ఓ జంతువులా చూపించాలని భావిస్తుంది. కానీ ఇక్కడ ఒకరు నాపై
పి.హెచ్.డి చేయాలనుకుంటున్నారు. నాకు అర్ధం కానీ విషయమేమిటంటే.. ప్రవీణ్ యజ్జలకు కూడా
నాలాగే పిచ్చి ఉందా..? అందుకే నా మీద పి.హెచ్.డి చేస్తున్నాడా..? అంటూ ట్వీట్ చేస్తూ..
సబ్జెక్ట్ కు సంబంధించిన లింక్స్ ను పోస్ట్ చేశారు.

rgv

rgv1

2