పవన్‌, క్రిష్‌ మూవీ టైటిల్‌ రిలీజ్‌


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తన 27వ చిత్రంతో అలరించేందుకు రెడీ అయ్యారు. క్రిష్‌ డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మహాశివరాత్రి సందర్భంగా చిత్రబృందం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు ‘హరి హర వీరమల్లు’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసింది. దీంతో పాటు పవన్‌కల్యాణ్‌ లుక్‌ను కూడా విడుదల చేసింది. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను బట్టి చూస్తుంటే మునుపెన్నడూ కనిపించని విధంగా సరికొత్త పాత్రలో పవన్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

పీరియాడికల్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో పవన్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ సందడి చేయనుంది. చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

CLICK HERE!! For the aha Latest Updates