రజినితో సినిమా రాజమౌళి రెస్పాన్స్!

అపజయమెరుగని దర్శకుడిగా పేరు గాంచిన సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే సినిమా మామూలుగా ఉండదని అభిమానులు సంబరపడ్డారు. అయితే అసలు ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా..? లేవా..? అనే విషయంపై తాజాగా రాజమౌళి స్పందించారు. ఇటీవల లండన్ లో బాహుబలి టీంతో కలిసి ఓ సినీ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. అందులో భాగంగా రజినితో సినిమా గురించి కూడా స్పందించారు. 
 
”రజినీకాంత్ పెద్ద స్టార్ హీరో. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క దర్శకుడు కలలు కంటుంటాడు. నేను దానికి మినహాయింపు కాదు. అయితే నేను ఎవరితో సినిమా చేయాలన్నా కథ నన్ను నడిపించాలి. రజినీకాంత్ గారికి సరిపడే కథ నా దగ్గర ఉంటే.. ఆయనతో సినిమా చేసే విధంగా ఆ కథ నాకు స్పూర్తినిస్తే ఖచ్చితంగా సినిమా చేస్తాను. అదే గనుక జరిగితే నా అంత సంతోషపరుడు ప్రపంచంలో ఉండడు” అని స్పష్టం చేశారు.