
Prabhas Spirit Movie Update:
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తున్న సినిమా గురించి భారీ అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా తన చిత్రాల్లో కథానాయకుడిని శక్తివంతంగా చూపించి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898AD, సలార్ వంటి హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కథలపై ఆసక్తికరమైన ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనుండగా, అతని పాత్రకు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయట.
ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ జకార్తాలో ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం అక్కడ లొకేషన్లను ఫైనల్ చేస్తుండగా, ప్రభాస్ తన కొత్త లుక్ కోసం శ్రద్ధ పెట్టాడట.
ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. కానీ వరుణ్ తేజ్ టీమ్ ఈ రూమర్స్‌కి వీటిలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.
ఈ చిత్రంపై మరింత సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డ్రగ్ మాఫియాపై ప్రభాస్ పోలీస్‌గా పోరాడతాడన్న కథ విన్నప్పుడే ఊహించడానికే హై వోల్టేజ్ యాక్షన్ సినిమా అనిపిస్తోంది.
ALSO READ: SSMB29 మొదటి షూటింగ్ షెడ్యూల్ ఏ దేశంలో అంటే!