HomeTelugu Trendingవరుణ్‌తేజ్ గాండీవధారి అర్జున టీజర్‌

వరుణ్‌తేజ్ గాండీవధారి అర్జున టీజర్‌

Varuntej Gandeevadhari
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘గాండీవధారి అర్జున’ సినిమా. ఈ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు. భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.

బీవీఎస్ ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు డైరెక్టర్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాలో వరుణ్‌తేజ్ ‘అర్జున్ వర్మ’ అనే పాత్రలో నటిస్తున్నాడు. వరుణ్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌. ‘ఏజెంట్’ మూవీ తర్వాత ఈ సినిమాలోనటిస్తోంది.

మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి హైలైట్‌ కానుంది. విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలో నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్ ఇప్పటివరకు సైనికుడిగా, సైంటిస్ట్‌గా, మంచి లవర్ బాయ్ పాత్రల్లో మెప్పించాడు. ఇప్పుడు ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు ఛేజింగ్ సీన్స్‌, బ్లాస్టింగ్ సీన్స్‌ను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!