ఉయ్యాలవాడలో వెంకీ స్పెషల్ రోల్..?

రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి 151వ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. నిజానికి చిరు 150వ సినిమా సమయంలోనే రామ్ చరణ్ కొందరి హీరోలతో సినిమాలో స్టెప్పులు వేయించాలనుకున్నాడు. కానీ కుదరలేదు. ఆ లిస్ట్ లో వెంకీ కూడా ఉన్నాడు. మొన్నమధ్య వెంకీ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఆ కోరికను 151తో తీర్చుకోబోతున్నారు.

చిరు 151కోసం రామ్ చరణ్ ఇప్పటికే వెంకటేష్ తో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. చరణ్ తన కొత్త సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వెళ్లకముందే వెంకీను కలిసి అంతా మాట్లాడుకొని వెళ్లారట. మొదట కేవలం స్టెప్స్ వేయించాలనుకున్నా.. ఉయ్యాలవాడ చారిత్రక నేపధ్యం ఉన్న సినిమా కావడంతో ఈ సినిమాలో వెంకీ ఓ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం అన్ని పనులు పూర్తయితే ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమవుతుంది.