HomeTelugu Trendingవెంకటేష్‌ 'నారప్ప' షూటింగ్‌ షురూ

వెంకటేష్‌ ‘నారప్ప’ షూటింగ్‌ షురూ

Venkatesh narappa shootinలాక్‌డౌన్ తరువాత టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలు షూటింగు మొదలైయ్యాయి. ప్రభుత్వం నిబంధనల మేరకు పాటిస్తూ.. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు షూటింగుల్లో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం తాజా షెడ్యూలు కూడా నిన్న హైదరాబాదులో మొదలైంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌కి ముందు అరవైరోజులు జరిగింది.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘గతంలో అనంతపురం జిల్లా పాల్తూరు గ్రామంలో ఈ చిత్రం షూటింగును ప్రారంభించాం. ఆ తర్వాత తమిళనాడులోని కురుమలై, తెరికాడు రెడ్ డెజర్ట్ వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరించాం. ఇప్పుడు కీలక సన్నివేశాలు, క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రియమణి, రావు రమేశ్, రాజీవ్ కనకాల తదితరులపై షూటింగ్ చేస్తున్నారు. హీరో వెంకటేశ్ కూడా త్వరలో గురువారం జాయిన్ అయ్యాడు. తమిళంలో వచ్చిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. డి.సురేశ్ బాబు, కలైపులి థాను కలసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!