‘వేదం’ నటుడు నాగయ్య మృతి

టాలీవుడ్‌లో ‘వేదం’ సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌ముఖ నటుడు నాగ‌య్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గుంటూరు జిల్లా దేసవరం పేటకు చెందిన నాగయ్య ‘వేదం’ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆయన తన నటన, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

దీంతో ఆయనకు తెలుగులో నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్‌ సార్‌, ఏ మాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్‌, విరంజితో పాటు పలు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇలా ఆయన దాదాపు 30 సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. కొంతకాలం తర్వాత సినిమాలు లేక ఆకలితో భిక్షాటన కూడా చేసినట్లు తెలుస్తుంది. ఆ పరిస్థితిలో సీఎం కెసిఆర్ నాగయ్యకు లక్ష రూపాయలు ఆర్థికసాయం చేశారు. అనంతరం మా అసోసియేషన్ వారు ప్రతినెలా నాగయ్యకు 2500/- పింఛన్ అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం నాగయ్య మరణంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

CLICK HERE!! For the aha Latest Updates