పవన్, వెంకీలపై త్రివిక్రమ్ షాట్!

కొన్నేళ్ళ క్రితం ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్, వెంకటేష్ లు కలిసి నటించే ఆడియన్స్ ను మెప్పించారు. నిజజీవితంలో వారిద్దరూ మంచి స్నేహితులు కావడంతో తెరపై కూడా వారి కెమిస్ట్రీ బాగా పండింది. అప్పటినుండి ఇద్దరు కలిసి మరో సినిమా చేస్తారేమో అని అభిమానులు ఎదురుచూశారు. పవన్, వెంకీలు కూడా ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ వీరిద్దరిని ఒకే ఫ్రేములో చూపించడానికి రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తోన్న సినిమాలో ఓ క్యామియో రోల్ లో వెంకీ కనిపించబోతున్నాడు. క్యామియో అంటే ఏదొక సీన్ లో, సాంగ్ లో కనిపించడం కాదూ..

సినిమాలో కీలకమైన సన్నివేశలో ఓ పాత్ర వచ్చి అందరినీ నవ్వించి వెళ్లిపోతుందట. త్రివిక్రమ్ ఆ పాత్ర రాసుకున్నప్పుడు ఎవరైనా హీరోతో చేయించాలని అనుకున్నాడు. అప్పుడు పవన్, వెంకీ అయితే ఎలా ఉంటుందని అడగడంతో వెంటనే వెంకీని సంప్రదించడం దానికి ఆయన అంగీకరించడం జరిగిపోయాయి. అంతేకాదు ఈరోజు వెంకీకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరి ఈ సీన్ లో వెంకీ, పవన్ లు కలిసి ఎంత హంగామా చేస్తారో.. చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!