‘వెంకిమామ’ ఫస్ట్ లుక్.. వైరల్‌

విక్టరీ వెంకటేష్.. ఎఫ్ 2మూవీ తరువాత .. నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా ‘వెంకిమామ’. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా వెంకిమామ సినిమాలోని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

వెంకటేష్ భుజంపై నాగచైతన్య చేయివేసి కూర్చొని ఉంటాడు. పల్లెటూరిలో షూట్ చేసిన ఈ ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వెంకటేష్ కు జోడిగా పాయల్ నటిస్తుంటే.. నాగచైతన్యకు జోడిగా రాశి ఖన్నా చేస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates