సాయి పల్లవి ఫెవరెంట్‌ సినిమా ఇదే!

సాయి పల్లవి.. ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఫిదా సినిమాతో పాపులర్ అయ్యింది. సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్లా అంటూ ఆమె చెప్పిన డైలాగులు ప్రతి ఒక్కరిని కట్టిపడేశాయి. ఈ సినిమా తరువాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. అయినప్పటికీ ఫిదా అంతటి ఇంపాక్ట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ నటి తమిళంలో ఎన్జీకే సినిమా చేస్తోంది. సూర్య హీరోగా చేస్తున్న ఈ పొలిటికల్ త్రిల్లర్ రేపు విడుదల కాబోతున్నది.

అంతకు ముందు తమిళంలో మారి 2 చేసింది. అందులో రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఇటు తెలుగులో ఫిదాలోని వచ్చిండే సాంగ్ కూడా అంతే రికార్డులు సృష్టించింది. ఎన్జీకే సినిమా రిలీజ్ సందర్భంగా సాయి పల్లవి ట్విట్టర్ లో చిట్ చాట్ చేసింది. నెటిజన్లు ఆమెతో చాట్ చేసేందుకు ఆసక్తి చూపించారు. అనేక ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా సాయి పల్లవికి ఇష్టమైన సినిమా ఏది అని అడిగితె…. కణ్ణత్తిల్ ముత్తమిత్తల్ సినిమా అని, రీసెంట్ గా సూపర్ డీలక్స్ సినిమా అని చెప్పింది.

CLICK HERE!! For the aha Latest Updates