HomeTelugu NewsVijay Devarakonda: నాక్కూడా పెళ్లి, పిల్లలు కావాలని ఉంది.. కానీ!

Vijay Devarakonda: నాక్కూడా పెళ్లి, పిల్లలు కావాలని ఉంది.. కానీ!

vijay devarakonda interesting comments on marriageVijay Devarakonda : రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుద‌ల‌కు రెడీగా ఉంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో.. మూవీ యూనిట్‌ ప్రమోషన్‌ జోరు పెంచేశారు. గురువారం తిరుప‌తిలో గ్రాండ్‌గా మూవీ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించిన మూవీ టీమ్.. తాజాగా త‌మిళ‌నాడులో ఓ ప్రెస్‌మీట్ నిర్వ‌హించింది.

ఈ స‌మావేశంలో విజ‌య్ త‌న తరువాతి సినిమా విశేషాలతో పాటు పెళ్లి ముచ్చ‌ట్లు పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయన త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. విజ‌య్ మాట్లాడుతూ.. “నాక్కూడా పెళ్లి చేసుకోవాల‌ని, తండ్రి కావాల‌ని ఉంది. కానీ ఇప్పుడే చేసుకోను. త‌ప్ప‌కుండా ప్రేమ పెళ్లే చేసుకుంటా. నా త‌ల్లిదండ్రుల‌కు నేను చేసుకోబోయే అమ్మాయి త‌ప్ప‌క న‌చ్చాలి.

ఇక నా సినిమాల విష‌యానికి వ‌స్తే.. కొంత‌మంది త‌మిళ ద‌ర్శ‌కులు నాకు స్టోరీలు చెప్పారు. అందులో కొన్ని నాకు బాగా న‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఫైన‌ల్ అవుతాయని అనుకుంటున్నా. అలాగే గౌత‌మ్ తిన్న‌నూరితో నేను చేయ‌బోయే సినిమాలో చాలామంది కోలీవుడ్ న‌టీన‌టులు నటించనున్నారు.

ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా యూనివర్స‌ల్ కంటెంట్‌తో తీర్చిదిద్ద‌డం జ‌రిగింది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. ఏప్రిల్ 5న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నాం. రెండు వారాల త‌ర్వాత హిందీతో పాటు మ‌ల‌యాళంలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించాం.

ఒక్క త‌మిళ‌నాడులోనే 250 థియేట‌ర్ల‌లో మూవీ విడుద‌ల అవుతుంది. ఇటీవ‌ల సెన్సార్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్‌కు యూ/ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. అలాగే సినిమా నిడివి 2.40 గంట‌లు ఉంటుంది. ఎమోష‌న్, యాక్ష‌న్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇలా అన్నీ ఈ చిత్రంలో చాలా బాగా కుదిరాయి. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం” అని విజ‌య్ చెప్పుకొచ్చాడు.

ప‌రశురామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ మూవీని నిర్మించారు. అలాగే గీత గోవిందం త‌ర్వాత ఈ మూవీకి కూడా గోపి సుంద‌రే సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల‌యిన పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై ఈ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!