HomeTelugu Trendingనన్ను రియల్‌ మేన్‌గా చూడటం లేదు సార్‌..

నన్ను రియల్‌ మేన్‌గా చూడటం లేదు సార్‌..

3 23
లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పనుల్లో ఆడవారికి చేయాలి అనే కాన్సెప్ట్‌తో మొదలైన ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్. టాలీవుడ్ ప్రముఖులు ఒకరి తరువాత మరొకరికి ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోల దాకా వచ్చి చేరింది. సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని ఇంటి పనులు చేస్తున్నారు. హీరో ఎన్టీఆర్‌ను ఛాలెంజ్‌ స్వీకరించిన దర్శకుడు కొరటాల శివ.. టాస్క్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఛాలెంజ్‌కు ఆయన సన్సేషన్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ను నామినేట్‌ చేశారు. దీనికి విజయ్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. తనను ఇంట్లో ఇంకా రియల్‌ మేన్‌ లా చూడటం లేదని.. పిల్లలానే ట్రీట్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు విజయ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.శివ సార్‌, మా అమ్మ నన్ను పని చేయనియట్లే. ఎందుకంటే పని రెండింతలు అవుతుందంటా. ఇంట్లో ఇంకా రియల్‌ మేన్‌లా చూడట్లే మమ్మల్ని.. పిల్లలానే ట్రీట్‌ చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌లో నేను చేసే పనిని అందరికి చూపిస్తాను’ అని విజయ్‌ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu