కీర్తి సురేష్ ఫొటో షేర్ చేసిన విజయ్‌ దేవరకొండ


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రానికి ఎట్టకేలకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ప్రస్తుతం ఆర్జీవి.. తన నిర్మాణంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను వర్మ శిష్యుడు సిద్ధార్ధ్ తాతోలు డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాకు టైగర్ కంపెనీ ప్రొడక్షన్ నిర్మాణ భాగస్వామిగా ఆర్జీవి ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. ఈ సినిమాతో పాటు వర్మ తన నిర్మాణంలో ‘బ్యూటీఫుల్’ (ట్రిబ్యూట్ టు రంగీలా) అనే సినిమాను తెరకెక్కించాడు. నైనా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సూరి హీరోగా నటించాడు.ఈ సినిమాను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను వర్మతో కలిసి దర్శకత్వం వహించిన అగస్త్య మంజు డైరెక్ట్ చేసాడు. తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఒక్క కట్ లేకుండా ‘A’ సర్టిఫికేట్ జారీ చేసింది. రొమాంటిక్ ప్రేమకథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.

CLICK HERE!! For the aha Latest Updates