పవన్‌ కళ్యాణ్‌కు మద్దతు తెలిపిన విజయ్‌ దేవరకొండ

నల్లమల అడవుల్లోని యురేనియం తవ్వకాలకు సంబంధించిన అంశం గత కొన్ని రోజులుగా మీడియాలో నిలిచింది. నల్లమలలో ఈ తవ్వకాలను చేపట్టకూడదని, తవ్వకాలు చేపడితే. దాని వలన పర్యావరణంలో సమతుల్యత లోపిస్తుందని, కొన్ని భవిష్యత్ తరాల ప్రజలు ఇబ్బందులు పడతారని అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకు ముందు యురేనియం తవ్వకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ సేవ్ నల్లమల అంటూ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.

వీరికి మద్దతుగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కూడా గొంతు కలిపాడు. సోషల్ మీడియా ద్వారా తన మద్దతు తెలిపారు. నల్లమల అడవిని కాపాడుకోవడానికి ఆంధ్రా, తెలంగాణలోని అన్ని పార్టీలు ముందుకు రావాలని, నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేసే వరకు ఉద్యమం చేయాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూడాలి.