HomeTelugu Newsసమంతను టీజ్ చేస్తున్న విజయ్- కారణం అదేనా ?

సమంతను టీజ్ చేస్తున్న విజయ్- కారణం అదేనా ?

sam vijay movie

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విజయ్ దేవరకొండ, ఇటీవల తన నెక్ట్స్ ప్రాజెక్టును కూడా అనౌన్స్ చేశాడు. మరోసారి పూరీ జగన్నాధ్‌తో కలిసి ‘జనగణమన’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. పూర్తి దేశభక్తి సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.మరో పక్క సినిమాల పరంగా సమంత కూడా జోరు పెంచింది. ఏప్రిల్ 28న సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా అనే చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. అలాగే సమంత పాన్ ఇండియా మూవీ యశోద కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. తాజాగా సమంత మరో చిత్రాన్ని కూడా షురూ చేసింది..

విజయ్ దేవరకొండ సరసన సమంత నటించబోతున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలు నిజమయ్యాయి. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించబోతున్నారు. మహానటి తర్వాత సమంత, విజయ్ దేవరకొండ మరోసారి నటించబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది గురువారం రోజు ఈ చిత్రం ఘనంగా ప్రారంభం అయింది. సమంత ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్న కారణంగా ఈ చిత్ర లాంచింగ్ కి హాజరు కాలేదని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న రాహుల్ రామకృష్ణ, కమెడియన్ వెన్నెల కిషోర్‌లు కూడా ఈ వేడుకలో మిస్ అయ్యారు. దీంతో ఈ ముగ్గురి ఫోటోలను యాడ్ చేసి ఈ సినిమా ఓపెనింగ్‌కు సంబంధించిన ఓ ఫోటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే అసలైన పూజా కార్యక్రమం ఫోటో అని.. ఈ ఫోటోను ప్రెస్ మీడియా వారు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నా.. అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అయ్యింది.

గని’ ఫైనల్ కలెక్షన్స్..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!