అనుష్క షాక్ ఇచ్చింది!

ఇప్పటి వరకు తెలుగు, తమిళ ఇండస్ట్రీ అగ్ర హీరోల సరసన నటించిన అనుష్క గతంలో గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలే వేసింది.  కానీ కొద్ది కాలంగా నటనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించి మెప్పించింది. అయితే ‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా బరువు పెరిగిన అనుష్క చాలా కాలం వరకు ఆ వెయిట్ తగ్గడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. స్వతహాగా యోగా టీచర్ అయిన అనుష్క తన బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

తాజాగా అనుష్క ఫేస్‌బుక్‌లో ఓ కొత్త ఫొటోను పోస్ట్‌ చేశారు.   అనుష్క ఈ ఫొటోకు క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ‘ఏదో అద్భుతం జరగడం వల్ల కలలు నెరవేరవు.. దాని కోసం చెమట చిందించాలి, అంకితభావంతో కృషి చేయాలి’ అని ఆమె రాశారు. ఈమె కొత్త లుక్ చూసిన వారందరూ కూడా షాక్ అవుతున్నారు. సడెన్ గా ఆమె మెరుపుతీగలా మారడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది.