కపిల్ దేవ్ బయోపిక్‌ లో క్రేజీ హీరో!

1983 అనగానే మనకు వరల్డ్ కప్ గుర్తుకు వస్తుంది. క్రికెట్ లో అరివీర భయంకరులుగా పేరుపొందిన వెస్ట్ ఇండీస్ జట్టును ఇండియా ఫైనల్లో మట్టికరిపించి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంటుంది. ఈ వరల్డ్ కప్ లో కృష్ణమాచార్య శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపధ్యాన్ని తీసుకొని కపిల్ జీవిత చరిత్ర ఆధారంగా కపిల్ దేవ్ బయోపిక్ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకుడు. రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రను పోషిస్తున్నారు.

అప్పట్లో కృష్ణమాచార్య శ్రీకాంత్ ఆల్ రౌండర్ గా ఉండేవారు. బౌలింగ్ చేస్తూనే.. ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగేవాడు. డ్యాషింగ్ హిట్టర్ గా పేరుంది. క్రికెట్లో శ్రీకాంత్ కు చాలా వెయిట్ ఉంది. ఇలా చాలా బరువైన ఈ పాత్రకోసం దర్శక నిర్మాతలు విజయ్ దేవరకొండను కలిసినట్టుగా సమాచారం. విజయ్ కూడా శ్రీకాంత్ పాత్రలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.