రవితేజ ‘టచ్ చేసి చూడు’!

‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ పేరుతో ఓ భారీ చిత్రం రూపొందనుంది.బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు .జనవరి 26 (గురువారం) రవితేజ బర్త్ డే సందర్భంగా  ఈ సినిమా వివరాలను దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. “మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేసారు. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం.” అని తెలిపారు.

దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ.. “ఇదొక డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్.ఇందులో ఇద్దరు కథానాయకులుంటారు. ఇప్పటికే రాశి ఖన్నాను ఎంపిక చేసాం. మరొక నాయికను త్వరలోనే ప్రకటిస్తాం.హేమాహేమీలైన సాంకేతిక బృందం ఈ చిత్రానికి పనిచేస్తున్నారు” అని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here