మహేష్‌తో విజయ్‌ దేవరకొండ!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ‘మహర్షి’ తరువాత చేస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరూ’. ఈ సినిమా మే 31 వ తేదీన ప్రారంభమైంది. జూన్ 26 వ తేదీ నుంచి రెగ్యులర్ షూట్ ఉంటుంది. మహేష్ విదేశాల నుంచి వచ్చాక ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. రష్మిక మందన్న హీరోయిన్. విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇది నిజమో కాదో తెలియదుగాని, సోషల్ ఇండియాలో మాత్రం ట్రెండ్ అవుతున్నది.

మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఓ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ రోల్ ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ విజయ్ ఈ సినిమాలో నటిస్తే అది ఒక రికార్డ్ అవుతుంది. ఎలా అంటే.. గీత గోవిందం సినిమాలో హీరో హీరోయిన్లుగా చేసిన ఇద్దరు.. మహేష్ సినిమాలో నటిస్తే అది రికార్డే.