
HIT 3 collections Day 2:
నాచురల్ స్టార్ నానిని ఒకసారి మళ్లీ మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులు కలసి దీవిస్తున్నారు. అతని లేటెస్ట్ సినిమా HIT 3 అద్భుతమైన ఓపెనింగ్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. చాలా రోజుల తర్వాత, ఒక తెలుగు సినిమా థియేటర్లకు మంచి జనం లాగించిందంటే, దానికి కారణం నాని స్టామినా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
HIT 3 మొదటి రోజు రూ.43 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సౌత్ ఇండియాలో టియర్ 2 హీరోలలో నానికే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. రెండవ రోజు కూడా వర్కింగ్ డే అయినా సినిమా సూపర్ హోల్డ్ చూపించింది. ప్రొడక్షన్ హౌస్ విడుదల చేసిన డేటా ప్రకారం రెండవ రోజు రూ.19 కోట్లు వసూలు కాగా, రెండు రోజుల కలెక్షన్ల మొత్తం రూ.62 కోట్లకు చేరింది.
View this post on Instagram
ఈ వీకెండ్‌లో సినిమాకు ఇంకా బలంగా గ్రోత్ ఉండే అవకాశం ఉంది. ప్రేక్షకులు పోటెత్తే పరిస్థితి చూస్తే, 100 కోట్ల గ్రాస్ మార్క్ సులభంగా చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమాలో నాని ఇచ్చిన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ శైలేష్ కొలను తీయగా చెప్పిన కథన శైలి, సినిమాటోగ్రఫీ అందించిన సాను వర్గీస్ విజువల్స్ హైలైట్ అయ్యాయి. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రావు రమేష్, ప్రత్యేక్ బబ్బర్, కొమలీ ప్రసాద్, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రల్లో మెప్పించారు. మిక్కీ జే మేయర్ సంగీతం కూడా ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేసింది.
సింపుల్‌గా చెప్పాలంటే, HIT 3 తో నాని మళ్లీ థియేటర్‌లో మాస్‌ని రిపీట్ చేయించాడు. సినిమా చూసినవాళ్లంతా “ఇదే మిస్ అవ్వొద్దు బాస్!” అంటున్నారు!
ALSO READ: Kalki 2898 AD సినిమా విషయం లో జరిగిన తప్పు Spirit లో లేకుండా చూస్తున్న Sandeep Vanga