‘గల్లీబాయ్‌’గా దేవరకొండ?

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ ‘గల్లీబాయ్‌’ గా మారబోతున్నారట. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన చిత్రం ఇది. జోయా అక్తర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆలియా భట్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.230 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు దీన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సాయిధరమ్ తేజ్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విజయ్‌ను హీరోగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాతలు విజయ్‌తో సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోంది.

విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. రష్మిక కథానాయిక. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. విజయ్‌ ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. శివ నిర్వాణతోనూ ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates