HomeTelugu Trending'విమానం' ప్రోమో విడుదల

‘విమానం’ ప్రోమో విడుదల

Samuthirakani Vimanam Promoతమిళ నటుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విమానం’. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అంగవైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో సముద్ర ఖని న‌టించాడు.

జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ సినిమా రూపొందుతోంది. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా జూన్ 9న ‘విమానం’ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, విమానం ప్రోమోను చిత్రబృందం శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

ఈ ప్రోమోను చూస్తే… తండ్రీ కొడుకుల మ‌ధ్య అనుబంధం క‌నిపిస్తుంది. రాజు అనే అనే అబ్బాయి త‌న తండ్రి పాత్ర‌లోని స‌ముద్ర ఖ‌నితో మాట్లాడుతూ.. ఓసారైనా త‌న‌ని విమానం ఎక్కించ‌మ‌ని అడుగుతుంటాడు. విమానం ఎక్కడానికి ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్న‌గా క‌నిపిస్తాయ‌ని అంటాడు. అయితే బాగా చ‌దువుకుంటే పెద్ద‌య్యాక నువ్వే విమానం ఎక్కొచ్చ‌ని తండ్రి అంటాడు.

ఇందులో సున్నితంగా, చ‌క్క‌గా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న భావోద్వేగాల‌ను రైట‌ర్, డైరెక్ట‌ర్ శివ ప్ర‌సాద్ యానాల ప్రోమోలో చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో స‌ముద్ర ఖ‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌తో పాటు మీరా జాస్మిన్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందించారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu