HomeTelugu Trendingకలర్‌ఫుల్‌గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన 'వెంకీ మామ'

కలర్‌ఫుల్‌గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ‘వెంకీ మామ’

5 1విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలు .. వీరిద్దరి కాంబోలే తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. రియల్ లైఫ్‌లోనే కాదు.. తొలిసారి రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా కనిపించబోతున్నారు. అయితే, వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మామా అల్లుళ్లుగా కలర్‌ఫుల్‌గా మెరిసిపోతున్నారు. వెంకటేష్, నాగచైతన్య కలిసి ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. ఈ పోస్టర్‌లో వెంకీ, చైతు లుక్ అదిరిపోయింది. ఇద్దరూ పంచెకట్టులో ఇరగదీశారు. ఇక, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu