HomeTelugu Big Storiesడబ్బు కోసం బిగ్‌బాస్‌లాంటి షోకి వెళ్ళను: విష్ణు ప్రియ

డబ్బు కోసం బిగ్‌బాస్‌లాంటి షోకి వెళ్ళను: విష్ణు ప్రియ

Vishnu Priya sensational co 1
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్. దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఫేమస్ అయిన ఈ షో ప్రారంభమైందంటే చాలు ఇక ప్రేక్షకులకు పండగే. ఈ షోని విమర్శలు వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ షోపై విమర్శంచే వారు కూడా ఉన్నారు. తాజాగా యాంకర్ విష్ణుప్రియ ఈ షోపై కామెంట్స్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు ‘పోవే పోరా’ షో ద్వారా పరిచయమైంది విష్ణు ప్రియ. ఈ ముద్దుగుమ్మ తాజాగా ‘చెక్‌మేట్’ అనే సినిమా చేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లో అందాల ఆరబోత, లిప్‌లాక్స్‌తో రెచ్చిపోయి కనిపించింది. ఈ నేపథ్యంలో విష్ణుప్రియను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా.. ‘చెక్‌మేట్’ మూవీ సంగతులతో పాటు బిగ్‌బాస్ గురించి మాట్లాడింది.

బిగ్ బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభానికి ముందు ఈ షోలో కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ కనిపించనుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని సదరు యూట్యూబ్ ఛానల్ ఆమె వద్ద ప్రస్తావించడంతో షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది విష్ణుప్రియ. తనకు బిగ్‌బాస్ అంటే అస్సలు నచ్చదని, ఎన్ని కోట్లిచ్చినా బిగ్‌బాస్ వెళ్లనని చెప్పింది. బయట ఇంత అందమైన ప్రపంచాన్ని వదులుకొని ఒక హౌస్‌లో ఉండాల్సిన అవసరమేంటి? అంటూ లాజిక్ మాట్లాడింది.అంతటితో ఆగక.. ”బిగ్‌బాస్ హౌస్‌లో కొట్టుకోవడం, తిట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి గ్రూప్ నుంచి ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. నా ఉద్దేశం ప్రకారం లైఫ్‌లో ఏ ఒక్కరినీ ఎలిమినేట్ చేయకూడదు. వీలైతే ప్రేమించాలి. కేవలం డబ్బు కోసం అలాంటి పనులు చేయను. అందుకే బిగ్ బాస్ షోకి ఫ్యూచర్‌లో కూడా వెళ్లను. రాసిపెట్టుకోండి. ఒకవేళ వెళ్తే నన్ను బ్లేమ్ చేసేయండి” అని ఛాలెంజ్‌ చేసింది ఈ బ్యూటీ

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!