HomeTelugu Trendingఇవే తగ్గించుకుంటే మంచిది!.. విశ్వక్ సేన్ ఎక్స్‌ట్రాలపై నెటిజన్ల కౌంటర్లు

ఇవే తగ్గించుకుంటే మంచిది!.. విశ్వక్ సేన్ ఎక్స్‌ట్రాలపై నెటిజన్ల కౌంటర్లు

Vishwaksen about Upcoming P

విశ్వక్ సేన్ సినిమాలంటే జనాల్లో కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే విశ్వక్ సేన్ ఆఫ్ స్క్రీన్‌లో చేసే అతి వల్లే సినిమా రిజల్ట్స్ కూడా మారుతుంటాయి. మొదట్లో అయితే విజయ్ దేవరకొండతో పోటీగా విశ్వక్ సేన్ అన్నట్టుగా ఉండేది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశ్వక్ సేన్ ఎప్పుడూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు. దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా విశ్వక్ సేన్‌కు మంచి టాలెంట్ ఉంది. దాంతో పాటు కాస్త యాంగర్ ఇష్యూస్, ఆటిట్యూడ్ ప్రాబ్లం, ఎక్స్ ట్రా మాటలు వదిలే కోణం కూడా ఉంది.

ఫలక్ నుమా దాస్‌తో మంచి టెక్నీషియన్‌గా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అశోకవనంలో సినిమాతో నటుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు. రకరకాల చిత్రాలు చేస్తూ హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఓరి దేవుడా అంటూ ఓ రీమేక్ చేశాడు. అది యావరేజ్‌గా నిలిచింది. పాగల్ డిజాస్టర్ అయింది. దాస్ కా ధమ్కీ ఎటు పోయిందో ఎవ్వరికీ తెలియదు. ఇలా విశ్వక్ సేన్‌కు ఓ సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమే అవుతోంది. ఇక ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ విషయంలో విశ్వక్ సేన్ చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అయితే గామీ మేకింగ్ వీడియోను వదిలి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ మాట్లాడిన మాటలు విని అంతా నవ్వేసుకుంటున్నారు. ఇకపై తాను ప్రయోగాలు చేయనని, రానున్న రెండు మూడేళ్లలో ఫైర్ గేమ్ ఆడతానని, బాక్సాఫీస్ పని పడతాను అన్నట్టుగా కాస్త ఎక్స్ ట్రాలు మాట్లాడాడు. అయితే వీటిపై జనాలు మాత్రం విపరీతంగా ట్రోల్స్ వేస్తున్నారు.

ముందుగా ఓ హిట్టు కొట్టి మాట్లాడు అని ఒకడు.. ఇలాంటివి మాటల్లో కాదు చేతల్లో చూపించు అని మరొకడు.. ఈ ఎక్స్ ట్రాలే తగ్గించుకుంటే మంచిది అని ఇంకొకడు ఇలా పలు రకాలుగా విశ్వక్ సేన్ మాటల మీద కౌంటర్లు వేస్తున్నారు. మరి విశ్వక్ సేన్ చెప్పినట్టుగా చేయగలడా? లేకపోతే అవన్నీ గాలి మేడల్లా అవుతాయా? అన్నది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!