HomeTelugu Trendingవిశ్వక్ సేన్ Laila కి పెద్ద సమస్య.. విడుదల కష్టమేనా?

విశ్వక్ సేన్ Laila కి పెద్ద సమస్య.. విడుదల కష్టమేనా?

 Vishwak Sen's Laila Faces Struggles Ahead of Release
Vishwak Sen’s Laila Faces Struggles Ahead of Release

laila:

యంగ్ హీరో విశ్వక్ సేన్ గతేడాది అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బేబీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ ఏడాది, ఆయన నటించిన ‘లైలా’ (Laila) సినిమా ఫిబ్రవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ నారాయణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, విడుదలకి ఒక మంచి అవకాశం చూపిస్తోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ‘లైలా’ మూవీని డిస్ట్రిబ్యూటర్లు కొనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

గత ఏడాది విశ్వక్ సేన్ చేసిన సినిమాల్లో ‘గామి’ మాత్రమే కొంతమేర విజయవంతం అయింది. అయి, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాఖీ’ వంటి చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ‘లైలా’ మూవీ, విశ్వక్ సేన్ కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని అందరూ ఎదురు చూస్తుండగా.. డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఈ సినిమాని కొనడానికి భయపడుతున్నారని సమాచారం.

‘లైలా’ చిత్రంలో విశ్వక్ సేన్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. ఒకటి అమ్మాయిగా, మరొకటి యువకుడిగా. మొదటగా, ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు, విశ్వక్ సేన్ అమ్మాయి వేషంలో ఉన్న ఫోటోను విడుదల చేసి, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. కానీ ఆ తర్వాత విడుదలైన ఎటువంటి ప్రమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయా. ఇక సినిమాకి ప్రస్తుతం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సరిగ్గా జరగలేదు.

ఈ సినిమాని తీసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు ధైర్యం చేయలేకపోతున్నారట. ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. ఫ్రీ రిలీజ్ డీల్‌లు ఇంకా పూర్తి కాలేదు అని తెలుస్తోంది. పైగా, ఫిబ్రవరి 14న ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి, దీంతో ‘లైలా’కు పోటీ మరింత పెరిగింది. ఈ క్రమంలో ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కావడం కష్టమేనని సమాచారం. మరి చివరికి ఏమవుతుందో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu