మేం మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం: వెంకటేశ్‌, రానా

స్టార్‌ హీరో వెంకటేశ్‌ తన తండ్రి దగ్గుబాటి రామానాయుడును చాలా మిస్‌ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రామానాయుడు వర్థంతి. ఈ నేపథ్యంలో కుమారుడు వెంకటేశ్‌, మనవడు రానా సోషల్‌మీడియా వేదికగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. ‘మాకు ఎన్నో జ్ఞాపకాల్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేం మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం. ఎప్పటికీ మీ లోటు ఇలానే ఉంటుంది’ అంటూ వెంకటేశ్‌ తండ్రితో ఉన్న ఫొటోల్ని షేర్‌ చేశారు.

‘మీరు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. కానీ మీరు నింపిన స్ఫూర్తి మమ్మల్ని మరింత దృఢంగా తయారు చేసింది. మిస్‌ యు తాత’ అని రానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. బాల్యంలో రామానాయుడు తనను ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. అనారోగ్యంతో రామానాయుడు 2015 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఆయన అత్యధిక సినిమాలు తీసిన నిర్మాతగా గిన్నీస్‌ బుక్‌ రికార్డులోకి ఎక్కారు. 2012లో పద్మభూషణ్ అవార్డు, 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన్ను వరించాయి.

https://www.instagram.com/p/BuA6FXZBxAF/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/BuA1t2tj9h3/?utm_source=ig_web_copy_link