నెక్ట్స్‌ బర్త్‌డే ముఖ్యమంత్రి కార్యాలయంలో జరుపుకుందాం: కమల్‌ హాసన్‌

విలక్షణ నటుడు, మక్కల్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ఇటీవలే తన 66 వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా కమల్ కు విషెస్ చెప్పారు. తనకు విషెస్ చెప్పినవారందరికీ కమల్ ధన్యవాదాలు కూడా తెలిపారు.ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నాకు విషెస్ చెప్పిన అభిమానులకు సినీ క్రీడా రాజకీయ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. మీ అందరి శుభాకాంక్షలూ నా పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా మార్చాయి. నా పుట్టిన రోజు నాడు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ‘మక్కల్ నీది మయ్యం’ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ కష్టానికి ప్రేమకు తగ్గ ఫలితం దక్కేందుకు కష్టపడతా. నా తదుపరి పుట్టినరోజును ఫోర్ట్ సెయింట్ జార్జ్ (తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం)లో జరుపుకుందామ’ని కమల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates