స్లిమ్‌ అయిన అనుష్కతో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా.?

‘సైజ్ జీరో’ సినిమా కోసం లావు పెరిగిన అనుష్క బాహుబలి సినిమా సమయంలో కాస్త లావుగానే కనిసించింది. ఆ తరువాత చేసిన భాగమతిలో కూడా అదే వెయిట్ తో కనిపించింది. బాహుబలి మైథలాజికల్ సినిమా కావడంతో భారీగా ఉండటం అవసరం. అందుకే అదే వెయిట్ మైంటైన్ చేసింది. ఆ సినిమా పూర్తయ్యాక కూడా ఈ దేవసేన లావుగానే ఉండటంతో అవకాశాలు రాలేదు. ఒకవేళ వచ్చినా.. ఆమె ఎందుకో తిరస్కరించింది. భాగమతి తరువాత మరో సినిమాకు అప్పట్లో సైన్ చేయలేదు.

మాములుగా వెయిట్ తగ్గడానికి సినీ తారలు ఎక్కువగా జిమ్ చేస్తుంటారు. లేదంటే.. డైట్ కంట్రోల్ చేసుకుంటూ.. ఆపరేషన్ చేయించుకుంటారు. ఇలా చేయడం వలన హెల్త్ తో పాటు వారి అందంపై ప్రభావం చూపుతుంది. అందుకే అనుష్క ఈ పద్దతులను పక్కన పెట్టి డిటాక్స్ పద్దతిని ఎంచుకుంది. ఈ డిటాక్స్ పద్దతిలో నైపుణ్యం కలిగిన ల్యూక్ కౌంటింహో సలహా మేరకు బరువు తగ్గడం మొదలు పెట్టింది. ఇప్పుడు అనుష్క స్లిమ్ గా మరింత అందంగా మారిపోయింది. ఆస్ట్రియాకు తన హెల్త్ ట్రైనర్ ల్యూక్ కౌంటింహో తో కలిసి ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.