
Highest Paid Music Director in South India:
కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీలోనే కాదు, టెక్నీషియన్ల రేంజ్ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోల remunerations ఏలాంటి రేంజ్‌లో ఉంటాయో, మ్యూజిక్ డైరెక్టర్లదీ కూడా అలాంటి స్థాయికే వెళ్లిపోతోంది.
ఈ ట్రెండ్‌కు ముందు వరుసగా నిలబడినది రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP). పుష్ప 2 కోసం ఆయన్ను ఏకంగా రూ.12 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఇది తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లలో డబుల్ డిజిట్ ఫీ తీసుకున్న మొదటి ఉదాహరణ.
ఇక థమన్ విషయానికి వస్తే, వరుస హిట్లతో ఇండస్ట్రీలో తన స్థానాన్ని బలపర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒక సినిమాకు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇవే కాకుండా అనిరుధ్ రవిచందర్ అయితే సౌత్ ఇండస్ట్రీ మొత్తానికీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అతను ఒక సినిమాకు రూ.15 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఆయన సినిమాల మ్యూజిక్ రైట్స్ రూ.18 కోట్లకు పైగా అమ్ముడవుతున్నాయట!
ఇంకా రైజింగ్ టాలెంట్స్ విషయానికొస్తే, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కూడా మంచి డిమాండ్ మీద ఉన్నాడు. ఆయన ప్రస్తుతం రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. నిర్మాతలు మాత్రం అతనితో ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు.
కన్నడ నుంచి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ కూడా టాలీవుడ్‌లో బిజీగా ఉన్నాడు. ఆయన రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన్ను అంతా ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు.












