Game Changer promotions with Salman Khan:
హిందీ బిగ్ బాస్ 18 ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఎపిసోడ్‌లతో ముందుకు సాగుతోంది. ఈ వారం ఎమోషనల్ ఫ్యామిలీ విజిట్స్, డ్రామా ట్విస్టులతో పాటు, వీకెండ్ కా వార్ (WKV) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ హిందీ బిగ్ బాస్ స్టేజ్‌పై మొదటిసారి అడుగుపెట్టబోతుండడం.
రామ్ చరణ్ తన రాబోయే సినిమా Game Changer ప్రమోషన్‌లో భాగంగా హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. ఆయనతో పాటు కో-స్టార్ కియారా అద్వానీ కూడా పాల్గొంటున్నారు. ఇది హిందీ బిగ్ బాస్ షోలో రామ్ చరణ్ మొదటి ఎంట్రీ, కానీ ఆయనకు ఈ ఫ్రాంచైజీతో ఒక చిన్న పరిచయం ఉంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫినాలేలో ఆయన ఒక ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే.
RAM CHARAN – KIARA ADVANI: ‘GAME CHANGER’ *HINDI* TRAILER IS HERE… 10 JAN 2025 RELEASE… Ahead of its release on 10 Jan 2025 [#Sankranti], the makers of #GameChanger – starring #RamCharan and #KiaraAdvani – unveil the power-packed #GameChangerTrailer.#SSRajamouli launched… pic.twitter.com/ZpLhOLK40i
— taran adarsh (@taran_adarsh) January 2, 2025
ఈ ప్రత్యేక ఎపిసోడ్ షూట్ నిన్న జరిగింది. అలాగే సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మైత్రి చూస్తే అభిమానులు మరింత ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహం ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్, చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాలో గెస్ట్ రోల్ చేసినప్పుడు, రామ్ చరణ్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో యెంటమ్మ సాంగ్‌లో కనిపించి తన డాన్స్‌తో సందడి చేశారు.
ఇద్దరు హీరోలు ముంబై, హైదరాబాద్‌లలో ఒకరినొకరు కలుస్తుంటారు. ఈ ఎపిసోడ్ ద్వారా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది. రూమర్స్ ప్రకారం, బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోయే RC16 సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ALSO READ: Anant Ambani పెట్టుకున్న అరుదైన వాచీ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!