HomeTelugu Big Storiesకరోనా వ్యాక్సిన్‌పై ఉపాసన స్పందన

కరోనా వ్యాక్సిన్‌పై ఉపాసన స్పందన

Upasana about corona vaccin
కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా రూపొందిచినట్లు ఇటీవల ప్రకటించింది. అయితే నేటి నుంచి దేశ వ్యాప్తంగా అనేక మంది కరోనా టీకాలను అందుకోనున్నారు. ఇదిలా ఉంటే నేడు కరోనా వ్యాక్సిన్ అందుకున్న వారిలో మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన తాతయ్య గారు కూడా ఉన్నారు. ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో నేడు కరోనా టీకాను అందుకున్నారు. దీనిపై ఉపాసన స్పందించారు. ‘మా వెనక ఉన్న గొప్ప శక్తి మా తాతగారు. పద్మ విభూషన్ డాక్టర్ సీ ప్రతాప్ రెడ్డి గారు నేడు కారోనా వ్యాక్సిన్ టీకాను వేయించుకున్నారు. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ అందండం గర్వపడాల్సిన విషయం. కరోనా నుంచి మనల్ని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతల’ని ఉపాసన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దేశమంతటా ఈ రోజు నుంచి కరోనా వ్యాక్షిన్ అందించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu