దుల్కర్‌..జాన్వి.. ఓ బయోపిక్‌!

నటుడు దుల్కర్‌ సల్మాన్‌, జాన్వి కపూర్‌ కలసి నటించబోతున్నాయి అని బాలీవుడ్‌ వర్గలు అంటున్నాయి. తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా జాన్వి ఓ చిత్రంలో నటించనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమా గురించి చర్చించడానికి జాన్వి.. గుంజన్‌ను కూడా కలిశారు. అయితే ఈ సినిమాలో జాన్వికి జోడీగా దుల్కర్‌ నటిస్తున్నట్లు తాజాగా వినిపిస్తున్న సమాచారం‌. అదే నిజమైతే హిందీలో దుల్కర్‌ నటించే మూడో చిత్రం ఇది అవుతుంది. ఇప్పటికే ‘కర్వా’, ‘జోయా ఫ్యాక్టర్‌’ చిత్రాల్లో దుల్కర్‌ నటించారు.

ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో జాన్వి గుంజన్‌ పాత్రలో నటించనున్నారట. ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి భారతీయ మహిళ గుంజన్‌. 1999 కార్గిల్‌ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను గుంజన్‌ తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరి మన్ననలు పొందారు. అందుకే ఆమె జీవితాధారంగా సినిమా తీయాలని కరణ్‌ భావించారట. మరో పక్క జాన్వి ‘తఖ్త్‌’ అనే చారిత్రక చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. చిత్రీకరణ వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో జాన్వితో పాటు ఆలియా భట్‌, రణ్‌వీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌, కరీనా కపూర్‌, భూమి పెడ్నే

CLICK HERE!! For the aha Latest Updates