మహేష్ ఇప్పుడేం చేస్తాడో..?

విమర్శలకు, వివాదాలకు ఆమడదూరంలో ఉండే మహేష్ బాబు ఇప్పుడు ఓ వివాదంతో వార్తల్లో నిలిచారు. తమిళులు పోరాడుతున్న ‘జల్లికట్టు’ నిరసనకు తన మద్ధతును ప్రకటించడమే మహేష్ చేసిన తప్పుగా కనిపిస్తోంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల బాధను చూసి రియాక్ట్ అయిన మహేష్ బాబు సొంత రాష్ట్రం మాత్రం ఏమైపోయినా.. పట్టించుకోడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. రీసెంట్ గా పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా అంశం విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి జనవరి 26న వైజాగ్ బీచ్ లో ఆంధ్రప్రదేశ్ యువతతో కలిసి మౌన నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

దీనికి మద్ధతుగా వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, సందీప్ కిషన్ ఇలా పలువురు సినీతారలు నిలిచారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్ వైపు మళ్ళింది. జల్లికట్టుకి మద్ధతు తెలిపిన మహేష్ బాబు స్పెషల్ స్టేటస్ పై పెదవి విప్పారా..? మద్ధతుగా నిలవరా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి వీటిపై మహేష్ ఎలా రియాక్ట్ అవుతాడో.. చూడాలి!