పూజాకు బంపర్ ఆఫర్!

తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినా అంతగా క్రేజ్ దక్కించుకోలేదు. ఇక బాలీవుడ్ లో మొహెంజోదారో సినిమా చేసిన ఈ అమ్మడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా చేశాక కాని హిట్ తలుపు తట్టలేదు. 

ఇక ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ భామ ఎకౌంట్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేయడం ఆమె కెరియర్ కు ఎంతో సహకరిస్తుందని చెప్పొచ్చు.
 
జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో తారక్ ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి నుండి సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. 
CLICK HERE!! For the aha Latest Updates