
Robinhood OTT release date:
నితిన్ నటించిన తాజా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్ ఇప్పుడు ఓటిటీలోకి రాబోతుంది. డైరెక్టర్ వెంకీ కుడుములతో నితిన్‌కి ఇది రెండో సినిమా. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ మంచి హిట్ కావడంతో, రాబిన్‌హుడ్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. కానీ, రిలీజ్‌కి ముందు వచ్చిన టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ప్రేమ, వినోదం, యాక్షన్ మిక్స్ చేసినా కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే డిజాస్టర్ అయ్యింది. మౌత్ టాక్ కూడా నెగటివ్‌గా ఉండటంతో కలెక్షన్స్ కింద పడిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటీలోకి వస్తుంది అని న్యూస్ బయటకు వచ్చింది. ZEE5 ఓటిటీ ప్లాట్‌ఫారంలో మే 10నుంచి స్ట్రీమింగ్‌కి రెడీ అవుతున్నట్టు క్యాటలాగ్‌లో కనిపించింది. అధికారికంగా ఏ అనౌన్స్‌మెంట్ లేదు కానీ ఇది కన్ఫర్మ్ అయినట్టే.
. @actor_nithiin & @sreeleela14 starrer #Robinhood will premiere on @ZEE5Global on May 10th
The film was a box office bomb let’s see how it does on OTT pic.twitter.com/6wrUyxvANN
— BINGED (@Binged_) May 3, 2025
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, ఇది నితిన్‌తో ఆమెకి రెండో సినిమా (ముందు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్ చేశారు). మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. అలాగే దేవదత్త నాగే, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో, ఆడుకలంన్ నరేన్, మైమ్ గోపి, సుభలేక సుధాకర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటిటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ALSO READ: “బాలీవుడ్ లో అసలైన సమస్య ఇదే!” WAVES Summit 2025 లో ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!