ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు!

నయనతార.. ప్రభుదేవాతో బ్రేకప్ అయిన కొన్నాళ్ళకు దర్శకుడు విఘ్నేశ్ సివన్ తో ప్రేమలో పడింది. చాలా రోజులుగా కోలీవుడ్ లో ఈ వార్తలు ప్రచారం అవుతున్నా.. వీరిద్దరూ కూడా వాటిని ఖండించలేదు. దీంతో మౌనం అంగీకారమనే అందరూ అనుకుంటున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడి దాదాపు రెండేళ్ళు దాటుతున్నా.. ఇంకా పెళ్లి ఊసేత్తడంలేదు. ఈ విషయంపై నయన్ ను ఎప్పుడు ప్రశించినా.. సమాధానం చెప్పదు గనుక ఎక్కువగా ప్రశ్నలు విఘ్నేశ్ కు ఎదురవుతుంటాయి.

తాజాగా అలాంటి సంధర్భం ఎదురైనప్పుడు విఘ్నేశ్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ మీదే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశాడు. దీన్ని బట్టి ఇప్పట్లో వీరి పెళ్లి జరిగే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు.  పైగా కెరీర్ వైజ్ ప్రస్తుతం ఇద్దరూ కూడా యమా బిజీ.. మరి పెళ్లి ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారో.. చూడాలి!