యువహీరో ఫీట్.. సోషల్ మీడియా ఫిదా!!

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిడెన్ టాలెంట్‌ను బయటపెట్టాడు. హిడెన్ టాలెంట్ అంటే సాంగ్స్ పాడటంమో మరొకటో మరొకటో అనుకునేరు.. అదేం కాదు. తాను ఎంత ఫిట్ గా ఉన్నాడో చెప్పేందుకు సింగిల్ హ్యాండ్ తో ఫీట్ చేశాడు. చిన్నప్పుడు మనం సర్కస్ లో చూస్తూనే ఉంటాం కదా. ఒక చేయి కిందపెట్టి పొర్లుగింత వేయడం. అలాంటిదే బెల్లంకొండ చేశాడు. ఆ ఫీట్ మొత్తాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. సోషల్ మీడియాలో మొత్తం ఫిదా అయింది. ఫిట్నెస్ కు ఇప్పటి యువత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది కదా. వైరల్ కావడానికి అంతకంటే ఇంకేంకావాలి.