‘హలో గురు ప్రేమ కోసమే’తో సింగర్‌గా మారిన రామ్‌?

ఈ రోజులో యంగ్ హీరోలు కేవలం నటులుగా మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. చాలా మంది హీరోలు నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తుండగా అడపాదడపా గాయకులుగా మారి సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో కూడాచేరిపోయాడు.

టాలీవుడ్ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ప్రస్తుతం ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. త్రినాథ్‌ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రామ్‌ గాయకుడిగా మారుతున్నాడట. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే రామ్‌ ఆలపించిన పాటను రికార్డ్ కూడా చేశారు. దిల్‌ రాజు బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌. ఈ సినిమాను అక్టోబర్‌ 18న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.