12 నుంచి ప్రజా సంకల్పయాత్ర పునః ప్రారంభం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్రను నవంబర్‌ 12 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించడంతో జగన్‌ పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు.

గాయం నుంచి కోలుకున్న వైఎస్‌ జగన్‌ ముందుగా ప్రకటించిన విధంగా ఇచ్ఛాపురం వరకు తన పాదయాత్రను కొనసాగిస్తారని రఘురాం వెల్లడించారు. ఈ నెల 12 న విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ నుంచి పాదయాత్ర పునః ప్రారంభం కానుందని పేర్కొన్నారు.