Homeపొలిటికల్YS Sharmila: ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది

YS Sharmila: ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారింది

YS Sharmila reacts on vizag drug case

YS Sharmila reacts on vizag drug case: ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.. ఇప్పుడు డ్రగ్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ ఏది కావాలన్నా ఆంధ్రప్రదేశ్‌లో దొరుకుతుంది అని మారిందని ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నాయని వివరించారు.

గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని షర్మిల విరుచుకుపడ్డారు. డ్రగ్స్ రవాణా, వాడకంలో నంబర్ వన్ అనే ముద్ర పడిందన్నారు. 25 వేల కేజీల మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరాయి. తమ తప్పు లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్రాల నిఘా వ్యవస్థ సాయం లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి?

డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా? మీ అండ దండలతో డ్రగ్స్ రవాణాలో ఏపీ సేఫ్ హెవెన్‌గా మారింది. తెర వెనుక ఎవరున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సీబీఐని కోరాం. ఆసియాలో అతి పెద్ద డ్రగ్ డీల్ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చాలి. పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu