HomeTelugu Newsజింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే(95) కన్నుమూత

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ముగాబే(95) కన్నుమూత

12 2జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(95) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొంత కాలంగా సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగాబే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందినట్టు జింబాబ్వే మీడియా పేర్కొంది. సుదీర్ఘకాలం పాటు జింబాబ్వేను పరిపాలించి రికార్డు సృష్టించాడు ముగాబే.. 1980లో జింబాబ్వేలో బ్రిటీష్ వలసవాదం ముగిసినప్పటి నుంచి 37 ఏళ్లు ఆయనే అధికారంలో కొనసాగారు. 93 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న దేశాధ్యక్షుడిగా కూడా ఆయన రికార్డుకెక్కారు. ఆయన విధానాలతో విసిగిపోయిన జింబాబ్వే ఆర్మీ 2017 నవంబర్ 21న తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకుంది.

నవంబర్ 21, 2017న ముగాబే రాజీనామా ప్రకటించారు. రాజీనామాను ప్రకటించిన తరువాత, రాజధాని హరారే వీధుల్లో వేడుకలు చేసుకున్నారు. తమకు స్వేచ్ఛ వచ్చిందంటూ నృత్యం చేసి పాటలు పాడారు ప్రజలు. ఇక తమకు మంచి భవిష్యత్తు రాబోతుందన్నారు. ఇక, ఆ తర్వాత దేశాధ్యక్ష బాధ్యతలు ఎమర్సన్ చేపట్టడం జరిగిపోయాయి. ఆయన పదవి కోల్పోయిన తర్వాత ఫిబ్రవరి 21, 2018న ముగాబే తన మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. గతంలో విలాసవంతంగా బర్త్‌డే వేడుకలను జరుపుకునే ఆయన ఒంటరైపోయారు. సైనిక సహాయంతో అతనిని తొలగించిన ప్రభుత్వం అతని పుట్టినరోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించినప్పటికీ, ఆయన గురించి ఆ రోజు దేశ అధ్యక్షుడు.. టెలివిజన్ ప్రసంగంలో అతని గురించి ప్రస్తావించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu