ఏదో ఆశించి ఈ పనికి ఒప్పుకుంటున్న వారే… కాస్టింగ్ కౌచ్ అంటూ గేములు ఆడుతున్నారు

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్యాస్టింగ్‌ కౌచ్‌ కు బలైయామంటూ..శ్రీ రెడ్డి, మాధవీ లత తదితరులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మరికొందరు కూడా వారితో గొంతు కలిపారు. ఐతే క్యాస్టింగ్‌ కౌచ్‌ అనే పదమే తప్పు అని నటి పవిత్రా లోకేష్ అన్నారు. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తు క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్రా లోకేష్ తాజాగా ఓ ప్రముఖ ఛానల్‌లో ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె స్పందించారు.

పవిత్ర లోకేష్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ శ్రీరెడ్డిపై పరోక్షంగా సెటైర్లు పేల్చింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో సంచలన విషయాలను వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని కుదిపేస్తున్నాయు. పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. “కాస్టింగ్ కౌచ్ అంశం అనేది చాలా సున్నితమైనది.. ఈ విశ్వంలో ఆడ – మగ అనే రెండే జాతులున్నాయి. ఆడవాళ్లు మగవాళ్లని.. మగవాళ్లు ఆడవాళ్లను ఉపయోగించుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది. అదే ప్రకృతి ధర్మం” అని కుండబద్దలు కొట్టింది.

‘మన బతకడానికి డబ్బు అవసరం . డబ్బే లక్ష్యంగా జీవితం సాగకూడదు. మనం చేస్తున్న పన్నిలో ఇబ్బంది తలెత్తినప్పుడు మరో పనిని చూసుకుంటాం. అంతే కదా. అందుకే కదా ప్రపంచంలో ఎన్నో పనులున్నాయు .ఏ పనిచేసే ముందు ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించాలి. అంగీకరించి ఆ పనిచేస్తే అది మన సమస్య మాత్రమే అవుతుంది.’ అంటూ కాస్టింగ్ కౌచ్ తప్పుకాదని చూచాయ గా వెల్లడించింది.

పవిత్ర మాట్లాడుతూ ‘కాస్టింగ్ కౌచ్ అనేది నా దృష్టిలో చాలా పెద్ద పేరు. 18 సంవత్సరాల చిన్నారులు రేప్ కు గురవుతున్నారు. ఇది అసలు పెద్ద విషయం . ఎవరైనా మాట్లాడితే ఈ చిన్న పిల్లల పై జరుగుతున్నదారుణాలపై మాట్లాడండి.. కాస్టింగ్ కౌచ్ పై కాదు ‘అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ’18 సంవత్సరాలు నిండిన తర్వాత ఇద్దరు ఆడ – మగ మధ్య జరిగిన వ్యవహారం గురించి ఎందుకు ఇంత రచ్చ. దీనికి అంగీకరిస్తున్న వారంతా చిన్నపిల్లలు కాదు కదా.. ఏదో ఆశించి ఈ పనికి ఒప్పుకుంటున్న వారే మళ్లీ కాస్టింగ్ కౌచ్ అంటూ గేములు ఆడుతున్నారు. ఆడ మగ మధ్య జరుగుతున్న విషయానికి అగ్రిమెంట్ ప్రకారం అంగీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మొదట్లోనే నో చెప్పే చాయిస్ ఉంది. కానీ ఎందుకు అలా చేయడం లేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చి వాడుకున్నారు అని గోల చేస్తే ఎలా’ అంటూ పవిత్ర లోకేష్ మండిపడింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గానే పవిత్ర ఈ ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. అవకాశాల కోసం – అవసరాల కోసం – డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారని.. ఇష్టం తో చేస్తే తప్పులేదని చెప్పి పవిత్ర చేసిన వ్యాఖ్యలు వివాదలు రేపుతున్నాయి.