అవకాశాల కోసం తప్పు చేయకూడదు

యాంకర్‌ అనసూయ తాజాగా కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. అనసూయ యాంకర్ గా ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరుకు టీవీ షో లతో పాటుగా సినిమాల్లో కూడా బిజీగా ఉంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని.. యాంకర్ గా వరుస ఆఫర్లను దక్కించుకుంది. ఇక తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ ఆసక్తికర కామెంట్లు చేసింది. యాంకర్ కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించగా… తాను అవకాశలకోసం ఎప్పుడూ వెళ్లలేదని కేవలం వచ్చిన అవకాశాలను మాత్రమే ఉపయోగించుకున్నానని చెప్పింది. జాబ్ చేస్తూనే యాంకరింగ్ లో అడుగుపెట్టానని తెలిపింది. యాంకర్‌గా మీకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవ్వలేదా అని అడిగినప్పుడు. అనసూయ అది మనం స్పందించే విధానంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పింది. అవకాశాల కోసం తప్పు చేయకుండా ఎదురు చూడాలి అంది. తనకు ఫేవరెట్ ఇజం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, దానివల్ల తాను అవకాశాలను పోగొట్టుకున్నానని తెలిపింది.

CLICK HERE!! For the aha Latest Updates