కళ్యాణ్ రామ్ ‘ఎంఎల్ఏ’ మొదలైంది!

నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ ‘ఎంఎల్ఏ’. ‘మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్’ అనేది కాప్షన్. ఈ చిత్రంలో అందాల భామ కాజల్ హీరోయిన్ గా కనిపించనున్నారు. విశ్వప్రసాద్ సమర్పణలో ,బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్ పి మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్ పి బ్యానర్ ల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయి బాబా దేవస్థానం లో జరిగింది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ తనయుడు సౌర్యా రామ్ మరియు నిర్మాత భరత్ చౌదరి తనయుడు కరణ్ ఈ చిత్రానికి క్లాప్ ఇవ్వగా, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కూతురు తారక అద్విత మరియు నిర్మాత ఎం.వి.కిరణ్ రెడ్డి కూతురు ఐక్రా కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దేవుడి పఠాల మీద చిత్రీకరించిన మొదటి షాట్ కు ప్రముఖ రచయిత కోనా వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. 
”ఆధ్యంతం వినోదభరితం గా సాగే ఈ చిత్రం హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక మంచి చిత్రం అవుతుంది అని నమ్ముతున్నాం. నూతన దర్శకుడు ఉపేంద్ర రాసుకున్న కథ చాలా ఫ్రెష్ గా ఉంది. జూన్ 9 నుండి షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం చివరి భాగం లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం” అని నిర్మాతలు తెలిపారు. 
”టోటల్ న్యూ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా లో కనపడతారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారి కి, చిత్ర నిర్మాతల కి కృతఘ్నతలు తెలుపుతున్నా. సినిమా టైటిల్ కి, కాప్షన్ కి పూర్తి జస్టిఫికేషన్ ఉంటుంది” అని దర్శకులు ఉపేంద్ర అన్నారు.